
గోదావరిఖని, వెలుగు: రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి నియంత్రణకు పటిష్ట నిఘా ఉంచాలని సీపీ అంబర్కిశోర్ ఝా అన్నారు. మంగళవారం కమిషనరేట్ ఆఫీసులో పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల సబ్ డివిజన్ అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారి చట్టబద్ధంగా పనిచేయాలని, మంచిగా పని చేసినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై స్టేషన్ అధికారులకు ముందస్తు సమాచారం ఉండాలన్నారు.
ప్రతి కేసులో టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. గంజాయి నియంత్రణకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం గంజాయి స్వాధీనం కేసులో ప్రతిభ చూపిన టూ టౌన్ సీఐ ప్రసాదరావుకు సీపీ రివార్డు అందజేశారు. మీటింగ్‌లో డీసీపీలు ఎ.భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సి.రాజు, ఏసీపీలు రాఘవేంద్రరావు, ఎం.రమేశ్, జి.కృష్ణ, నరసింహులు, మల్లారెడ్డి, ప్రతాప్ పాల్గొన్నారు.